చిరుతల మహాభారతము-నాటక ప్రదర్శన
ఓనమాస్ వార్తలు, దమ్మన్నపేట 13-04-2026
జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో చిరుతల మహాభారతము అనే నాటక ప్రదర్శనను ప్రదర్శన నిన్నటినుండి అనగా, 12-04-26 నుండి ప్రదర్శన జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయితి పాలకవర్గం సహకరిస్తున్నది. ఈ కార్యక్రమం 16-04-26 వరకు నిరాటంకంగా జరుపుటకు నిశ్చయించారు.
తిరుమలాపురం (P.D.) కు దగ్గరలోని దమ్మన్నపేట మరియు ఇతర పరిసర గ్రామాల్లోని వారితో వెల్ముల మాధవరావు కుటుంబానికి పరిచయాలున్నాయి. దమ్మన్నపేట, లక్ష్మీపురం, భీమరాజుపల్లి వంటి గ్రామాలలో మాధవరావు గారు ప్రైవేటు ఉపాధ్యాయునిగా విద్యాబోధన చేసారు. కావున నాటకంతో పాటు పాతవారిని చూసినట్లు కూడా వుంటుందని ఈరోజు దమ్మన్నపేట గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు మా తండ్రి మాధవరావు గారి శిష్యుడు శ్రీ బురికి రాజన్న గారు ఆతిథ్యమిచ్చారు.

శ్రీ బురికి రాజన్న గారితో డా. వెల్ముల కృష్ణారావు, ఇంటిపేర్ల పరిశోధకుడు
రాత్రి 9గంటలకు నాటకం మొదలవుతుందని శ్రీ రాజన్న గారు చెప్పారు.

రా. 8.52కి గణపతి ప్రార్థన, 8.55కి పోచమ్మ ప్రార్థనలతో నాటక ప్రదర్శన రెండోరాజు ప్రారంభం .

ఘటోత్కచుని ప్రవేశం
భీమసేనుని ప్రవేశం
లలితమ్మ ప్రదర్శన
అసంఖ్యాక ప్రేక్షక జనం వేయిపైనే వచ్చినట్లున్నారు
(1) విదూషకుని పాత్రకు బదులు, టోపి పెట్టిన జోకర్ పాత్రవల్ల, కాలానికి అనుగుణమైన పాత్ర లోపించింది.
2) అలాగే, పాండవులు తమ ప్రచ్ఛన్న వేషధారణలో, ఏకచక్ర పుర ప్రవేశ సమయంలో కూడా కత్తులను పట్టడం 1984-85 హింది పుస్తకం 6వతరగతిలో బోధించిన హోనేహార్ కళాకార్ అనే నాటిక ప్రదర్శన గుర్తుకు వస్తున్నది).