“అమరజీవి” అనభేరి ప్రభాకర్ రావు మరియు ఆయన అనుచరుల చరిత్ర రచన- అధ్యయన పర్యటన

onomasts news: 13-08-26

తెలంగాణ సాయుధ పోరాట ప్రప్రథమ దళ నాయకుడు, స్వాతంత్ర సమరయోధులు అనభేరి ప్రభాకర్ రావు మరియు అతని అనుచరుల జీవిత చరిత్ర రచన చేయడం జరుగుతున్నది.

అందులో భాగంగా, ఆనాటి సంఘటనల ప్రదేశాలను పరిశీలించడం కోసం పలువురు రచయితలు పోలంపల్లి, రేకొండ, మహ్మదాపురం, హుస్నాబాదు గ్రామాలను సందర్శించారు. అనభేరి ప్రభాకర్ రావు సొంత గ్రామం పోలంపల్లి నీ సందర్శించి అక్కడి గడీని రేకొండలో స్మారక భవనాన్ని సందర్శించి కొందరు గ్రామ పెద్దలను ఇంటర్వ్యూ చేసారు.

ఈ బృందంలో చరిత్ర రచనకు పూనుకున్న రచయిత మరియు ఇంటిపేర్ల పరిశోధకుడు డాక్టర్ వెల్ముల కృష్ణారావు, రచయిత డాక్టర్ తులా రాజేంద్ర కుమార్, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్, అనభేరి కుటుంబ సభ్యులు అన్నభేరి యుగంధర్ రావు, తుల మధుసూదన్ రావు గార్లు పాల్గొన్నారు.

వీరు ఈరోజు మహమ్మదాపూర్ లో అనభేరి మరియు అతని దళ సభ్యులు 12 మంది అమరులైన మహమ్మదాపూర్ గుట్టలలోని సమాధి ప్రాంతాన్ని కూడా స్థానిక గ్రామ పంచాయతీ నాయకులు, గ్రామస్తులందరితో కలిసి సందర్శించారు. గ్రామపంచాయతీలో గ్రామస్తులతో మార్చి 15 1948 నాటి తొలి ఎన్కౌంటర్ సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి, వారిని ఇంటర్వ్యూ చేసారు.

అనంతరం హుస్నాబాద్ లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి గారిని కలుసుకొని, మహమ్మదాపూర్ అమరవీరుల జ్ఞాపకాలను పంచుకున్నారు.

తెలంగాణ సాయుధ పోరాట వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో నమోదు చేయాలని గ్రామస్తులు కోరారు. హుస్నాబాద్ లో రోడ్డు వెడల్పులో తొలగించిన అన్నభేరి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని చరిత్ర అధ్యయన రచయితలు కోరారు

అనభేరి మరియు ఆయన దళ సభ్యుల కనీసం ఆనాడు ఆయనతోపాటు మరణించిన 12 మంది సహచరులకు సంబంధించిన వివరాలను తెలుపుటకు 9121006021 కు ఫోనుచేయాలని,

వివరాలను snvkrao88@gmail.com అనే మెయిల్ కు
లేదా

info@anabheri-hisfollowers-forgottenchapters.onomasts.com

అనే ఆయన వెబ్ మెయిల్ కు పంపాలని డాక్టర్ వెల్ముల కృష్ణారావు గారు కోరుతున్నారు.

అ తంలో వున్న దళ నాయకుడు మరియు దళ సభ్యుల వివరాలను ఎవరు రాసి పంపితే, వారి పేరనే పుస్తకంలో ముద్రించబడుతుందని, వెబ్సైటులో కూడా పెట్టబడుతుందని తెలుపుతున్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *