చిన్న పిల్లలు కాదు, చిచ్చర పిడుగులు- దమ్మన్నపేటలో చిరుతల రామాయణ ప్రదర్శనలు
25-05-26 ఓనమ(onoma) వార్తలు
స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర అధిక జ్యేష్ఠ మాస శుక్ల పంచమి, బుధవారం తేది 20-05-26 నుండి ఆదివారం 25-05-26 వరకు గోదావరిఖని దగ్గరలో గల చందనపూర్ గ్రామంలో చిరుతల రామాయణ ప్రదర్శన జరిగింది.
పాత్రధారులు చిన్న వయసులోని పిల్లలు అయినా కూడా, మంచి ప్రతిభ కనబరిచారు. వారికి ఓపికతో అభినయం నేర్పిన గురువును కూడా మనం అభినందించాలి.
గతంలో రామాయణం, ఈ మధ్యనే కొద్ది నెలల కిందట భారత ప్రదర్శనను కూడా ఇదే గ్రామంలో విజయవంతంగా ప్రదర్శింప చేసినారు. ఈసారి పిల్లలచే కూడా ప్రదర్శింపజేయడం ద్వారా, తమకు సాటిలేరని నిరూపించారు.ఇక్కడి కళాకారులను, కళాకారులను ప్రోత్సాహించి, మన ఆచార సంప్రదాయాలను పది కాలాల పాటు నిలబడడానికి సహకరించిన గ్రామస్తులు కూడా అభినందనీయులు.