Hindi divas - Poet sri Sabbani Laxminarayana-Hindi book "Mouna samudra" release.
|

హిందీ దివస్- ప్రముఖ కవి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ గారి “మౌన సముద్ర“ కవితా సంకలన ఆవిష్కరణ

ఓనామా న్యూస్, 12-09-26, కరీంనగర్.

“రాష్ట్రీయ హిందీ దివస్ “ (Hindi Diwas) సందర్భంగా నేడు అనగా తేది 12 సెప్టెంబర్ 2026, శనివారం, మధ్యాహ్నం 4 గంటలకు జరిపారు. నిజానికి 14-09-26 నాడు జరుగవలసిన ఈ కార్యక్రమాన్ని ఆ రోజు వినాయక చవితి పండుగ కారణంగా,  రెండు రోజుల ముందే దీనిని జరుపవలసివచ్చింది. దీనిని హిందీ ప్రేమీ మండలి (Hindi Premi Mandali), కరీంనగర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించారు.

కరీంనగర్ లోని గోదాం గడ్డలో, అయ్యప్ప గుడి వద్దగల ప్రణమ్ వయోవృద్ధుల దిన సంరక్షణ కేంద్రం, జిల్లా పరిషత్ క్వార్టర్స్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సీనియర్ సిటిజెన్ డే కేర్ సెంటర్ అధ్యక్షులు శ్రీ ఎం. అంజయ్య గారి అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు హిందీ భాష ప్రాముఖ్యత గురించి , గొప్పతనమును గురించి వివరించారు.  

ఇట్టి కార్యక్రమంలో ప్రముఖ కవి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ గారు గతంలో ఆయనే రచించి, ప్రస్తుతం హిందీలోకి అనువాదం చేసిన, “మౌన సముద్ర“ అనే కవితా సంకలన పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి వచ్చిన సుమారు యాభై మందికి పైగా హిందీ పండితులను, కవులను లయన్స్ క్లబ్, కరీంనగర్ వారు శాలువాతో సన్మానించారు. ప్రశంసా పత్రములతో పాటు, ఒక బట్ట సంచీని అందరికి బహూకరించి సత్కారం చేసారు. ప్లాస్టిక్ భూతానికి దూరంగా ఉండడానికి వారు బహూకరించిన ఈ  సంచీ అందరినీ ఆకట్టుకుంది.

ఇట్టి కార్యక్రమంలో సర్వశ్రీ ఉప్పల రామేశం , కోల అన్నారెడ్డి, బోయినపల్లి హనుమంత రావు, చింతల సత్యనారాయణ, మ్యాడమ్ శివకాంత్, పెద్ది విద్యాసాగర్, సింగమ రాజు ,  ముక్క శరత్ కృష్ణ  , బట్టు వినోద్, కేశవరెడ్డి, ప్రొఫెసర్ వాసాల వరప్రసాద్, మరియు హిందీ ఉపాధ్యాయులు ఉమర్ అలీ, ఎం. భారతి, విజయలక్ష్మి, యోగా సంపత్ , బాల్ రెడ్డి, నుజెట్టి రవీంద్ర నాథ్ , శివనారాయణ గార్లు, ఇంటిపేర్ల పరిశోధకుడు  డా. వెల్ముల కృష్ణారావు   తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.   

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *