హైదరాబాద్ నగర ఉద్యోగుల సహకార గృహనిర్మాణ సంఘం లి.వారి స్వర్ణోత్సవ సంవత్సర (1976-2026) ప్రత్యేక సర్వసభ్య సమావేశం
ఓనామా వార్తలు, NGO’s కాలని, 22-08-26:
రోజు అనగా తే. 22-08-2026 (శనివారం) నాడు ఉ. 10 గం.లకు స్వర్ణోత్సవ సంవత్సరం (1976-2026) సందర్భంగా, హైదరాబాద్ నగర ఉద్యోగుల సహకార గృహనిర్మాణ సంఘం లి. (T.A.B.-116) ఎన్.జి.ఓ. కాలనీ, హైదరాబాద్ వారి ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి నాగార్జున హైస్కూల్ సమీపంలో, ఎన్ జి ఓ కాలనిలోని కాపు భవనం వేదికగా నిలిచింది.

ఈ సమావేశానికి శ్రీ అనిసెట్టి శాయి కుమార్ గారు అధ్యక్షత వహించారు. శ్రీమతి MPN వర్ధని (కార్యదర్శి), బండి ఆంజనేయులు (ఉపాధ్యక్షులు), ఎం. ఓంప్రకాశ్ (కోశాధికారి) మరియు ఇతర కార్యవర్గ సభ్యులు వేదిక నలంకరించారు.
అధ్యక్షుని స్వాగతోపన్యాసం తరువాత, కార్యదర్శి గారు తమ నివేదికను, కోశాధికారి గారు తమ ఆర్థిక నివేదికను సమర్పించారు. నూతన కార్యవర్గ సభ్యులు ఇదివరదాకా వారు చేసిన సంఘ కార్యకలాపాలను, ప్రస్తుత సమస్యలను, చేయబోయే అంశాలను గూర్చి తెలిపారు.
సభ్యత్వ గుర్తింపు కార్డు కోసం అడ్మిషన్ నెంబర్, రెండు ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకొనిరావలసిందిగా కోరారు.
●షేర్ కేపిటల్ బకాయి ఉన్నవారు రూ. 200/- చెల్లించి ఓటు హక్కు పొందుటకు,
●మరణించిన సభ్యుల వారసులకు సభ్యత్వ కల్పించే విషయంగా సభ్యుల అనుమతి (ఓటింగ్)కి,
● దీర్ఘకాలికంగా సమావేశాలకు హాజరు కాని సభ్యుల సభ్యత్వ విషయంగా, ఏమి చేయాలనే నిర్ణయం గూర్చి ఆలోచించాలని అన్నారు.
సమావేశంలో పాల్గొన్న సత్యనారాయణ, సోమయాజులు మొదలగు పెద్దలు పాల్గొని కొన్ని సూచనలు చేసారు.
ఈ సమావేశంలో సభ్యుడు డా. వెల్ముల కృష్ణారావు గారు కూడా పాల్గొని , ఈ కింది అంశాలను చెప్పారు.

ప్రతిపాదించిన అంశాలు:
1. స్థలాల అన్యాక్రాంతం
1.1) ఎవరైనా సభ్యుల ఆర్థిక పరిస్థితుల వల్ల, ఇల్లు అమ్ముకోవలసి వస్తే, దానిని సంఘ సభ్యులకు మాత్రమే అమ్మాలి. అవసరమైతే, సంఘం మధ్యవర్తిత్వంలో తీసుకొని సభ్యులకు న్యాయం చేయాలి.
1.2) అన్యాక్రాంతమవుతున్న స్థలాల విషయంలో, తాము తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి చెప్పారు. అయితే, ఇందుకు సంబంధించిన విషయాలు మనం జాగ్రత్త చేయాలని కృష్ణారావుగారన్నారు.
2.సంఘం ఆస్తుల రక్షణ:
మన సంఘం ఆస్తులు, ఇతర ముఖ్యమైన విషయాలు తెలిసిన పెద్దలు కొన్ని చెప్పారు. ఇలాంటివి మనమందరం పంచుకోవాలి.
సభ్యుల గైర్హాజరు- ఆధునిక పద్ధతి పరిష్కారం:
3) సంఘ కార్యవర్గం, పెద్దలు చెప్పిన విషయాలను బట్టి తెలుస్తున్నదేమంటే, సమావేశాల గురించి తెలుపుతున్నా, అందరు రావటం లేదని, ఇలాటి (communication gap) దానికి పరిష్కారంగా పాత పద్ధతుల్లో కాకుండా, ఆధునిక పద్ధతిలో పోవాలని తెలిపారు. ఇందుకొరకు ఒక సభ్యునిగా మన సంఘం కొరకు తానొక వెబ్సైట్ ను ఉచితంగా తయారుచేసి ఇస్తానని తెలిపారు.
4. కాగితాల రహిత పద్ధతిలో నిర్వహణ:
మన సభ్యులు చెల్లించాల్సిన మొత్తము, సమావేశ సమాచారం, ఇతర నోటీసులు వంటివి కూడా వెబ్సైట్లో పెట్టవచ్చునని, పేపర్ లెస్ గా మారుతుందని, ఖర్చు తగ్గుతుందని తెలిపారు.
5. ఓటింగ్ నిర్వహణ- online & offline
ఓటింగ్ విషయంగా సమావేశాలకు రాలేనివారు కూడా online ఆ తర్వాత offlineటడ ఉంచవచ్చు. online ఓటింగ్ చేసినవారు మళ్లీ offline లో voting చేయుటకు వీలుండదని తెలిపారు. ఈ విషయంగా కృష్ణారావు గారిని శ్రీ అనిశెట్టి శాయి కుమార్ గారు అభినందించారు.

సమావేశానంతరం వచ్చిన వారందరికి మధ్యాహ్న భోజనం పెట్టారు.